కాటేదాన్​లో ..15 వేల కేజీల కల్తీ నెయ్యి సీజ్

కాటేదాన్​లో ..15 వేల కేజీల కల్తీ నెయ్యి సీజ్
  • 7,280 కేజీల బటర్, 105 కేజీల నెయ్యి, 525 కేజీల పాలపొడి స్వాధీనం
  • అన్ని పదార్థాలు కాలం చెల్లినవే
  • యజమాని అరుణ్ రెడ్డి అరెస్టు

శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా కాటేదాన్​లో నిర్వహిస్తున్న కల్తీ నెయ్యి తయారీ కేంద్రం గుట్టురట్టయింది. రాజేంద్రనగర్ ఎస్ఓటీ, మైలార్ దేవ్ పల్లి పోలీసులు రైడ్​చేసి భారీ మొత్తంలో కల్తీ నెయ్యి, కాలం చెల్లిన బటర్, మిల్క్​పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 3లో ఉండే అరుణ్ రెడ్డి, పిమసాని శ్రవణ్(37) అనే వ్యక్తితో కలిసి కాటేదాన్ పారిశ్రామికవాడలో ‘తెలంగాణ ఫుడ్స్’ పేరుతో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుంచి తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోని షాపులకు సరఫరా చేస్తున్నారు. 

సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్ఓటీ, మైలార్ దేవ్ పల్లి పోలీసులు తెలంగాణ ఫుడ్స్ పరిశ్రమపై బుధవారం రాత్రి రైడ్ చేశారు. గడువు ముగిసిన 7,280 కేజీల వెన్న,105 కేజీల నెయ్యి, 636 కేజీల మిల్క్ పౌడర్, 80 కేజీల మైదా పిండి,100 కేజీల కాస్టిక్ సోడా, 30 కేజీల బెల్లంతోపాటు ఇతర ఫుడ్ మెటీరియల్ ను సీజ్​చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు అందజేశారు. పట్టుబడ్డ కల్తీ నెయ్యి విలువ దాదాపు రూ.70 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అరుణ్​రెడ్డి, శ్రవణ్​ను అరెస్టు చేశారు.