షాపుల్లో అల్లం పేస్ట్ కొనాలంటేనే భయపడేలా చేస్తున్నారు.. ఈ బ్రాండ్ అస్సలు కొనొద్దు..!

షాపుల్లో అల్లం పేస్ట్ కొనాలంటేనే భయపడేలా చేస్తున్నారు.. ఈ బ్రాండ్ అస్సలు కొనొద్దు..!

వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో కల్తీ  అల్లం వెల్లుల్లి పేస్ట్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్ముతున్నట్లు పక్కా సమాచారంతో పరిగిలోని విఘ్నేశ్వర  ట్రేడర్స్లో దాడులు నిర్వహించారు. దాదాపు 80 కేజీల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ సీజ్ చేశారు. షాపు యజమానిపై కేసు నమోదు చేసి  టాస్క్ ఫోర్స్ టీం పరిగి పోలీసులకు అప్పజెప్పారు.

కల్తీ పేస్ట్ ఎక్కడ తయారవుతుంది.. దాన్ని ఎవరు సప్లై చేస్తున్నారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కల్తీ అల్లం పేస్ట్ అమ్మిన షాపు యజమానిపై గతంలో అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు పలు కేసులు కూడా ఉన్నాయి. నిషేధిత గుట్కా, కాలం చెల్లిన శీతల పానీయాలు విక్రయం, ట్యాక్స్లు ఎగ్గొడుతూ జీరో బిజినెస్ వంటి పలు కేసులు నమోదైనప్పటికీ సదరు నిందితుడి తీరు మారలేదు.

Also Read :- తిరుమలలో చిరుత కలకలం..

కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారుచేసి విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఘటనలు హైదరాబాద్లో కూడా ఇటీవల చాలానే వెలుగుచూశాయి. కల్తీల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్​ టాప్లో ఉన్నది. ఆ తర్వాత వంట మసాలాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కాటేదాన్లో ఫుడ్​ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఏకంగా 1400 కేజీల అల్లం పేస్ట్ను గుర్తించారు. దీనిని సింథటిక్​ ఫుడ్​ కలర్స్​తో తయారు చేస్తున్నట్టు తేల్చారు.

వంద గ్రాముల డబ్బాల దగ్గర నుంచి.. అర కిలో, కిలో వరకు ప్యాక్​ చేసి కిరాణా స్టోర్స్​కు వీటిని సరఫరా చేస్తున్నారు. ఏదో ఒక బ్రాండింగ్​ పేరు పెట్టి, వీటిని అమ్ముతున్నారు. ఎక్కువ మార్జిన్​ ఇస్తుండడంతో కిరాణా షాప్​ యజమానులు కూడా వీటినే సేల్​ చేస్తున్నారు. వాస్తవానికి తెలంగాణలో ఏ కూర చేయాలన్నా కచ్చితంగా అల్లంవెల్లుల్లి పేస్ట్ను వినియోగిస్తారు. 11 నెలల కాలంలో దాదాపు 6 వేల టన్నుల అల్లంపేస్ట్​ సీజ్​చేశారు.