చందానగర్ లో కల్తీ ఐస్ క్రీం తయారీ.. బ్రాండెడ్ స్టిక్కర్లతో అమ్మకాలు

చందానగర్ లో కల్తీ ఐస్ క్రీం తయారీ.. బ్రాండెడ్ స్టిక్కర్లతో అమ్మకాలు

ఎండాకాలం అనగానే  ఐస్ క్రీం గుర్తొస్తుంది. పిల్లలతో పాటు పెద్దలు ఐస్ క్రీంను తెగ తింటారు.   పిల్లలైతే ఐస్ క్రీలు కొనిచ్చే వరకు వదిలిపెట్టరు.  ఏదైనా పండుగొస్తే చాలు అక్కడ ఐస్ క్రీంలు ప్రత్యక్షమవుతాయి.ఐస్ క్రీంలకు  మార్కెట్లో డిమాండ్ ఉండటంతో కొందరు కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. కెమికల్స్ తో ఐస్ క్రీంలను తయారు చేస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.

ఏప్రిల్ 14న  హైదరాబాద్ లోని చందానగర్ లో బెస్ట్ ఐస్ క్రీం గోదాంపై జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీ చేశారు.  చందానగర్ ,పఠాన్ చెరు, మూసాపేట్ సర్కిల్ ఫుడ్ ఇన్స్పెక్టర్ లు తనిఖీలు చేశారు. ఐస్ క్రీమ్ తయారీకి ఉపయోగించే పదార్థాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్ కు తరలించారు.  ఇంక్రిడేన్స్ ప్యాకేట్స్ ను చూసి ఫుడ్ అథారిటీ అధికారులు  ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని అరెస్ట్ చేశామని.. పలు ప్లేవర్స్, ఐస్ క్రీమ్స్, బ్రాండెడ్ కంపెనీల స్టికరింగ్ సీజ్ చేశామని తెలిపారు.  ఈ దందా ఐదు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నట్లు గుర్తించారు అధికారులు. రెండు రోజుల క్రితం అత్తాపూర్ లో కల్తీ చాక్లెట్లు  తయారు  చేస్తున్న ఓ గోదాంలో  ఎస్ వోటీ పోలీసులు తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. పలు రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు.