కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తి అరెస్ట్‌

ఈ మధ్య ప్రతీది కల్తీ అవుతోంది. దీంతో బయట ఏది కొనాలన్నా భయం వేస్తుంది. ముఖ్యంగా నిత్యావసరాలు పాలు, నూనె, కూరగాయలు ఇలా నిత్యావసర వస్తువులు కల్తీ అవుతున్నాయి. మనం రోజు ఉదయన్నే తాగే పాలు కూడా కల్తీ అవుతున్నాయి.

Also Read : ఎరువులు బ్లాక్ లో అమ్మితే కఠిన చర్యలు : జి.రవినాయక్

తాజాగా యాదాద్రి భవనగిరి జిల్లాలో కల్తీ పాలు తయారు చేస్తున్న నిర్వహకుడిని ఫుడ్ సేప్టీ అధికారులు అదుపుతోకి తీసుకున్నారు. కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. 

భూదాన్ పోచంపల్లి మండలం భీమనపల్లి గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న కప్పల రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 350 లీటర్ల కల్తీ పాలు, 100 మీ. లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 2 డోలోఫర్ స్కిమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు.