ప్రాణాలతో చెలగాటం.. యాసిడ్స్ తో అల్లం వెల్లుల్లి పేస్టు తయారీ.. 7 టన్నులు సీజ్..

 రంగారెడ్డి జిల్లాలో  భారీగా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. బుద్వేల్ గ్రీన్ సిటీలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టు తయారు చేస్తున్న ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించారు సైబరాబాద్ SOT పోలీసులు. 15 లక్షల విలువైన 7 టన్నులకు పైగా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టును గుర్తించి స్వాదీనం చేసుకున్నారు. సింథటిక్ కలర్స్, యాసిడ్స్ ,కెమికల్ వాటర్ తో అల్లంవెల్లులి పేస్టు తయారు చేస్తునట్టు గుర్తించారు. 

అప్నా ఎంటర్ ప్రైజేస్ పేరుతో ఫ్యాక్టరీని రన్ చేస్తున్న అమీర్ నిజాన్ అనే వ్యక్తి  అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఒక్కటేనా లేక మరెక్కడైన ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారా అనే కోణంలో దర్యప్తు చేస్తున్నారు పోలీసులు.