జగిత్యాల చైర్ పర్సన్ గా జ్యోతి

జగిత్యాల, వెలుగు : జగిత్యాలలో బీఆర్​ఎస్​ రెబల్​  కౌన్సిలర్​ అడువాల జ్యోతి కాంగ్రెస్​, బీజేపీ, బీఆర్​ఎస్​, ఇండిపెండెంట్​   కౌన్సిలర్లమద్దతుతో బల్దియా పీఠాన్ని దక్కించుకున్నారు.  బుధవారం జరిగిన ఎన్నికలో  బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు సమిండ్ల వాణి, రెబల్​ అభ్యర్థిగా అడువాల జ్యోతి పోటీపడ్డారు.  9 మంది బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు విప్​ను ధిక్కరిస్తూ జ్యోతికి ఓటేశారు. కాంగ్రెస్​ కౌన్సిలర్లు  ఆరుగురు బీజేపీ కౌన్సిలర్లు ఇద్దరు, ఐదుగురు ఇండిపెండెంట్లు

ఒకరు ఎంఐఎం, మరొకరు ఫార్వర్డ్​ బ్లాక్​ కౌన్సిలర్లు మొత్తం 24 మందిమద్దతు తెలిపారు.   వాణికి బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు 20 మంది ఓటేయగా మరో కౌన్సిలర్​ గైర్హాజరయ్యారు. ఇండిపెండెంట్​, ఇతర పార్టీకి చెందిన మరో ఇద్దరు కౌన్సిలర్లు ఓటేశారు. ఎమ్మెల్యే ఎక్స్​ఆఫీషియో ఓటుతో కౌన్సిలర్​ వాణికి 23 ఓట్లు వచ్చాయి. దీంతో చైర్​పర్సన్​గా జ్యోతి ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. అనంతరం జ్యోతి చైర్ ​పర్సన్​గా ప్రమాణ స్వీకారం చేశారు. 

విప్ జారీ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే : 

29 మంది బీఆర్ఎస్  కౌన్సిలర్ల కు హై కమాండ్ విప్ కూడా జారీ చేసినప్పటికి చైర్ పర్సన్ పదవిని కొల్పోవాల్సి వచ్చింది.  వాణికి మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్  కోరగా..   కొంత మంది కౌన్సిలర్లు మాత్రం వ్యతిరేకించారు.  ఆ పార్టీకి చెందిన12 మంది కౌన్సిలర్లు విప్​ను ధిక్కరించడం  తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని, ధిక్కరించిన వారి పదవులను రద్దు చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మీడియాకు తెలిపారు.