మహబూబాబాద్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌గా అద్వైత్‌‌‌‌ కుమార్‌‌‌‌ సింగ్‌‌‌‌

మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌గా అద్వైత్‌‌‌‌కుమార్‌‌‌‌ సింగ్‌‌‌‌ నియామకం అయ్యారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న కలెక్టర్‌‌‌‌ శశాంక రంగారెడ్డి జిల్లాకు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ అయ్యారు. ఆయన స్థానంలో డిప్యుటేషన్‌‌‌‌పై సెంట్రల్‌‌‌‌ సర్వీస్‌‌‌‌లో పనిచేస్తున్న అద్వైత్‌‌‌‌కుమార్‌‌‌‌ను నియమిస్తూ బుధవారం సీఎస్‌‌‌‌ ఆదేశాలు జారీ చేశారు.

ములుగు ఎస్పీగా శబరీశ్‌‌‌‌

ములుగు, వెలుగు : ములుగు ఎస్పీ గౌస్‌‌‌‌ ఆలం ఆదిలాబాద్‌‌‌‌ ఎస్పీగా ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ అయ్యారు. ఆయన స్థానంలో హైదరాబాద్‌‌‌‌ సిటీ క్రైమ్స్‌‌‌‌ డీసీపీగా పనిచేస్తున్న శబరీశ్‌‌‌‌ను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ములుగు ఓఎస్డీగా పనిచేస్తున్న  అశోక్‌‌‌‌కుమార్‌‌‌‌ భూపాలపల్లి ఓఎస్డీగా ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ అయ్యారు.