ప్రజావాణి వినతులను వెంటనే పరిష్కరించాలి : అద్వైత్​ కుమార్​ సింగ్

మహబూబాబాద్, వెలుగు: ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలని మహబూబాబాద్​ ​ కలెక్టర్​ అద్వైత్​ కుమార్​ సింగ్అధికారులకు సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలో ని కలెక్టరేట్​లో ప్రజావాణి నిర్వహించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. మొత్తం  84 వినతులు వచ్చాయని, వాటిని వెంటనే పరిష్కరించాలని సూచించారు.  కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్ లు​ లెనిన్​ వత్సల్​ టొప్పొ, డేవిడ్​, జడ్పీ సీఈవో రమాదేవి, డీఆర్డఏ పీడీ  పురుషోత్తమ్​, సీపీవో సుబ్బారావు ఆఫీసర్లు  పాల్గొన్నారు.