జీహెచ్ఎంసీ సిబ్బందికి ముందస్తుగా జీతాలు

  •     దీపావళి సందర్భంగా రెండ్రోజులు ముందే అకౌంట్లలోకి..  

హైదరాబాద్ సిటీ, వెలుగు : దీపావళి పండుగ సందర్భంగా జీహెచ్ఎంసీ ఉద్యోగులు, కార్మికులకు ముందస్తుగా జీతాలు వేశారు. గత 8 ఏండ్లలో ఎన్నడూ లేని విధంగా రెండు రోజులు ముందే జీతాల చెల్లింపునకు రూ.120 కోట్లు విడుదల చేశారు. దీంతో బుధవారం దాదాపు 27వేల మంది ఉద్యోగులు కార్మికులు, పెన్షనర్లకు జీతాలు అందాయి. సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందనే సాకుతో బీఆర్ఎస్​ హయాంలో జీహెచ్ఎంసీ ఉద్యోగులు

 సిబ్బందికి ప్రతి నెలా ఒకటో తేదీన వేయాల్సిన జీతాలను 15 నుంచి 20 తేదీ లోపు చెల్లించేవారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక పరిస్థితి మారింది. ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు అందుతున్నాయి. దీపావళి పండుగ నేపథ్యంలో ఈసారి రెండు రోజులు ముందుగానే జీతాలు వేసేశారు. ఉద్యోగులు, కార్మికులు జీహెచ్ఎంసీకి కృతజ్ఞతలు తెలిపారు.