ఇండియన్ రైల్వేస్ IRCTC అడ్వాన్స్ టికెట్ బుకింగ్ టైంని తగ్గించింది. నేటి (నవంబర్ 1) నుంచి ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫారమ్ IRCTC ద్వారా అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్ లో కొత్త మార్పులను ప్రవేశపెట్టింది ఇండియన్ రైల్వేస్. టికెట్ లభ్యత, వెయిట్‌లిస్ట్‌లను నిర్వహించడానికి కొత్త పాలసీలో IRCTC బుకింగ్ విండోను 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించారు. రిజర్వేషన్ టిక్కెట్లు IRCTC యాప్, వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకునే వారు ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. IRCTCయే కాకుండా థర్డ్ పార్టీ బుకింగ్ సైట్‌లు, యాప్‌లకు కూడా ఈరోజు నుంచి ఇదే రూల్ ఉంటుంది. ముఖ్యమైన ఈ ఇన్ఫర్మేషన్‌ని ట్రైన్ జర్నీ చేసే మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. >>>
ఈ మేరకు మారిన రూల్స్ శుక్రవారం నుంచే అమలులోకి వచ్చాయి. ఇకపై ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలనుకునే వారు జర్నీ షెడ్యూల్‌కి 60 రోజుల ముందే చేసుకోవాలి. తత్కాల్ టికెట్ బుకింగ్‌లు మారవు. బయలుదేరే ఒక రోజు ముందు రిజర్వ్ చేసుకోవచ్చు. బుకింగ్ విండో AC కోచ్ లు ఉదయం 10 గంటలకు, నాన్-AC కోచ్ 11 గంటలకు ఓపెన్ అవుతాయి. IRCTCలో ఒక లాగిన్ సెషన్‌కు ఒక PNR నంబర్ మాత్రమే క్రియేట్ అవుతుంది. నెక్ట్స్ బుకింగ్ కోసం వేరే లాగిన్ చేయాలి. ఉదయం 8 గంటలకు ముందు లాగిన్ అయిన ప్రయాణీకులు ఖచ్చితంగా ఉదయం 8 గంటలకు లాగ్ అవుట్ చేయబడతారు. టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి మళ్లీ లాగిన్ అవ్వాలి. ప్రయాణీకులు తత్కాల్, AC టిక్కెట్ల ఖచ్చితంగా ఉదయం 10 గంటలకు లాగిన్ అవ్వాలి. నాన్-AC బుకింగ్‌ల కోసం ఉదయం 11 గంటలకు లాగిన్ అవ్వాలి.