- హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మంత్రులు తుమ్మల, పొంగులేటి, ఎంపీ రఘురాం రెడ్డి
ఖమ్మం టౌన్, వెలుగు : అత్యుత్తమ, ఆధునాతన, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేందుకు నూతన హంగులతో అంకుర ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి తెలిపారు. ఖమ్మం నగరంలోని గొరిల్లా పార్క్, సీక్వెల్ రిసార్ట్స్ సమీపంలో నూతనంగా నిర్మించిన అంకుర హాస్పిటల్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్త్రీలు, పిల్లల చికిత్సలో అంకుర ఆసుపత్రికి ప్రత్యేకమైన చరిత్ర ఉందన్నారు. నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం పట్ల నిర్వాహకులను అభినందించారు. అంకుర హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వున్నం కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అన్నీ బ్రాంచిల్లో మొత్తం 1800 పడకలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన నూతన భవనంలో 120 పడకలున్నట్లు తెలిపారు. ఖమ్మంలో 24 పడకల ఎన్ఐసీయూ (నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్), 18 పడకల పీఐసీసూ (పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్) ఉన్నట్లు చెప్పారు. నిపుణులైన శిశువైద్యులు, ప్రసూతి వైద్యులు, గైనకాలజిస్ట్లు, శిక్షణ పొందిన నర్సింగ్ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారన్నారు. ఖమ్మంలో కేంద్రంలో 3ఎం ఫెర్టిలిటీ సౌకర్యం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంకుర అసుపత్రి డైరెక్టర్ డాక్టర్ రాకేశ్చల్లగుళ్ల, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వ విజయబాబు, గిడ్డంగుల సంస్థల చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండ బాల కోటేశ్వరరావు, ఖమ్మం మేయర్ పోనుకొల్లు నీరజ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి. సుబ్బారావు, కార్పొరేటర్ కర్నాటి కృష్ణ , క్లస్టర్ మెడికల్ హెడ్ డాక్టర్ దుర్గాప్రసాద్, మెడికల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి పాల్గొన్నారు.