హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అడ్వాంటేజ్ అస్సాం రోడ్ షో

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అడ్వాంటేజ్ అస్సాం రోడ్ షో

హైదరాబాద్, వెలుగు: అస్సాంను పెట్టుబడుల కేంద్రంగా మారుస్తున్నామని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు తెలిపారు. పెట్టుబడిదారులకు సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌తో అనుమతులు ఇస్తున్నామని ప్రకటించారు. 

అస్సాం రాజధాని గౌహతిలో ఫిబ్రవరి 25, 26వ తేదీలలో  'అడ్వాంటేజ్ అస్సాం 2.0' పేరుతో నిర్వహించనున్న సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానించడానికి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో రోడ్​షో నిర్వహించారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనికేషన్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల అభివృద్ధిలో ఎంతో ప్రగతి సాధించామని వివరించారు.   ఏఐ, ఎంఎల్ వంటి నూతన టెక్నాలజీలపై ప్రత్యేకంగా దృష్టి  పెడుతున్నామని అన్నారు.