Money News : క్రెడిట్ కార్డును ఏయే సందర్భాల్లో వాడాలి.. టైంకి తిరిగి కట్టలేకపోతే ఏం చేయాలి.. లాభాలు.. నష్టాలు ఇలా..!

Money News : క్రెడిట్ కార్డును ఏయే సందర్భాల్లో వాడాలి.. టైంకి తిరిగి కట్టలేకపోతే ఏం చేయాలి.. లాభాలు.. నష్టాలు ఇలా..!

సరిగ్గా, జాగ్రత్తగా వాడుకుంటే క్రెడిట్‌‌‌‌‌‌‌‌ కార్డుతో చాలా  ప్రయోజనాలు పొందొచ్చు.  డ్యూడేట్‌‌‌‌‌‌‌‌లోపు బకాయిలు చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది.  కొన్ని కార్డులపై ఖర్చులు చేస్తే రివార్డ్ పాయింట్లు కూడా పొందొచ్చు. కార్డు నుంచి డబ్బులు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేసుకున్నా, వడ్డీ వేయడం లేదు కొన్ని కంపెనీలు. కానీ, జాగ్రత్తగా లేకపోతే అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఇది పెనాల్టీలకు అదనమని గుర్తుంచుకోవాలి. 

ఈ సందర్భాల్లో వాడితే ఎక్కువ బెనిఫిట్స్‌..

  • ఎలక్ట్రానిక్‌‌‌‌‌‌‌‌ గూడ్స్ లేదా ఫర్నిచర్ వంటి ఖరిదైన వస్తువులను కొనేటప్పుడు క్రెడిట్ కార్డులు బాగా సాయపడతాయి. క్రెడిట్‌‌‌‌‌‌‌‌ కార్డును  షార్ట్ టెర్మ్‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌గా పరిగణించొచ్చు. అందుకే అవసరమున్నప్పుడే వాడాలి. 
  • బకాయిలను వీలున్నంత తొందరగా తీర్చేయడానికి  ప్రయత్నించాలి.  లేకపోతే భారీగా వడ్డీ పడుతుంది. ఒకేసారి తీర్చలేమనుకుంటే, బకాయిలను  ఈఎంఐగా మార్చినా, డ్యూ డేట్‌‌‌‌‌‌‌‌లోపు చెల్లింపులు చేసేలా ప్లాన్ చేసుకోవాలి.
  • డైనింగ్‌‌‌‌‌‌‌‌, గ్రాసరీ షాపింగ్‌‌‌‌‌‌‌‌, పెట్రోల్ కొట్టించుకోవడం, ప్రయాణాలు..ఇలా కొన్ని సెగ్మెంట్ల కోసం సపరేట్‌‌‌‌‌‌‌‌గా క్రెడిట్ కార్డులను కంపెనీలు ఇష్యూ చేస్తున్నాయి.   ప్రయాణాలు బాగా చేసినప్పుడు ట్రావెలింగ్ కార్డు వాడితే  రివార్డ్‌‌‌‌‌‌‌‌ పాయింట్లు, క్యాష్ బ్యాక్‌‌‌‌‌‌‌‌లు ఎక్కువ పొందొచ్చు. ఇలాంటి సందర్భాల్లో క్రెడిట్ కార్డులను వీలున్నంతగా వాడుకోవాలి. కానీ, రివార్డ్‌‌‌‌‌‌‌‌లకు ఆశపడి మాత్రం ఖర్చులు  చేయకూడదు.
  • ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ కొనుగోళ్లకు క్రెడిట్ కార్డులను వాడడం ద్వారా కొన్ని ఫ్రాడ్స్‌‌‌‌‌‌‌‌ నుంచి రక్షణ పొందొచ్చు.  క్రెడిట్ కార్డుతో పేమెంట్స్ చేసేటప్పుడు సేఫ్టీ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలానే ఫ్రాడ్‌‌‌‌‌‌‌‌కు గురైనా వెంటనే కార్డును బ్లాక్ చేసుకునే వీలుంటుంది. మరోవైపు  చాలా స్ట్రీమింగ్ సర్వీస్‌‌‌‌‌‌‌‌లు లేదా ఓటీటీ సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌‌‌‌‌‌‌‌, మెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ కొనాలంటే  క్రెడిట్‌‌‌‌‌‌‌‌ కార్డు తప్పనిసరి.  ఆటోమెటిక్ పేమెంట్స్ కోసం ఈ కార్డుల అవసరం ఉంటుంది. 
  • హాస్పిటల్ ఖర్చులు లేదా బండి రిపైర్ వంటి ఊహించని సందర్భాల్లో క్రెడిట్ కార్డు ఆర్థికంగా సాయపడుతుంది.  ముందుగా ఖర్చు చేసి, తర్వాత  చెల్లింపులు చేసుకోవడానికి టైమ్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. కానీ, డబ్బులుంటే క్రెడిట్‌‌‌‌‌‌‌‌ కార్డును వాడకపోవడం మంచిది.
  • ప్రయాణాల  కోసం క్రెడిట్ కార్డును వాడుకోవచ్చు. క్యాష్  మోసుకెళ్లే అవసరం తగ్గుతుంది. చాలా ట్రావెల్ కార్డులు ఫ్రీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ లాంజ్ యాక్సెస్‌‌‌‌‌‌‌‌, ట్రావెల్ ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌, జీరో ఫారిన్‌‌‌‌‌‌‌‌ ట్రాన్సాక్షన్ ఫీజు వంటి ఆఫర్లను ఇస్తున్నాయి. ప్రయాణాల కోసం ఇటువంటి ఆఫర్లను ఇచ్చే క్రెడిట్ కార్డులను తీసుకోవడం బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.

సరియైన టైమ్‌‌‌‌‌‌‌‌కి బకాయిలను చెల్లించగలిగితే క్రెడిట్ కార్డును  బడ్జెటింగ్ టూల్‌‌‌‌‌‌‌‌గా వాడొచ్చు. ఒక నెలలో జరిగే ఖర్చులన్నింటిని కార్డుతో చెల్లించి, డ్యూడేట్ లోపు బకాయిలను తీర్చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా ఖర్చులకు సంబంధించిన వివరాలన్ని ఒకచోట ఉంటాయి. కానీ, డ్యూ డేట్‌‌‌‌‌‌‌‌ లోపు బకాయిలు చెల్లించగలమని నమ్మకం ఉంటేనే ఈ విధానాన్ని ఫాలో అవ్వాలి.

Also Read:-జాగ్రత్తగా వాడితే క్రెడిట్‌‌‌‌‌‌‌‌ కార్డుతో ప్రయోజనాలే ఎక్కువ...