జమిలి ఎన్నికలతో ఏం లాభం..? ఏం నష్టం..? ఏ ఏడాదిలో ఏ రాష్ట్రాల ఎన్నికలో లిస్ట్ ఇదే..

జమిలి ఎన్నికలతో ఏం లాభం..? ఏం నష్టం..? ఏ ఏడాదిలో ఏ రాష్ట్రాల ఎన్నికలో లిస్ట్ ఇదే..

‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో దేశవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకేసారి లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తున్నది. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడంతో దేశ ప్రగతికి ఆటంకం కలుగుతున్నదని ఆ పార్టీ మొదటి నుంచి వాదిస్తున్నది. టైమ్తో పాటు డబ్బులు కూడా ఆదా అవుతాయని చెప్తున్నది.

2027 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేసి తొలి దశలో లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నది. అవి పూర్తైన వంద రోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. అయితే.. ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ కోసం రాజ్యాంగంలోని కనీసం ఆరు ఆర్టికల్స్ను సవరించాల్సి ఉంటుంది. కానీ, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణలకు ఎన్డీఏ కూటమికి అవసరమైన సంఖ్యా బలం లేదు. అయినా, ఈ బిల్లు ఆమోదించుకునేందుకు కూటమి పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. జమిలి ఎన్నికలతో లాభనష్టాలేంటో సవివరంగా తెలుసుకుందాం.

జమిలి ఎన్నికలతో ఏం లాభం..?
‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’’.. అమల్లోకి వస్తే రాష్ట్రాల్లో తరచూ ఎన్నికల కోడ్‌‌‌‌‌‌‌‌ వంటి అడ్డంకులుండవు. అభివృద్ధి పనులు, నియామకాలు, నిధుల విడుదల, కొత్త పథకాల అమలు వంటివి సాఫీగా సాగుతాయి. ఎన్నికలు నిర్వహించేందుకు అయ్యే ఖర్చు తగ్గుతది. సిబ్బంది వినియోగంతో పాటు నిర్వహణ భారం తగ్గుతుంది. ఓటింగ్‌‌‌‌‌‌‌‌ శాతం పెరుగుతుంది. ఒకేసారి లోక్​సభ, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఓటేయడానికి ప్రజలు తరుచూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

జమిలి ఎన్నికలతో ఏం నష్టం..?
ఏకకాలంలో ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆయా పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రక్రియతో స్థానిక సంస్థల సమస్యలు పరిష్కారం కాకుండా పోయే ప్రమాదం ఉందని మరికొందరు అంటున్నారు. ఎన్నికల ఫలితాల్లో పారదర్శకత ఉండదనేది మరికొందరి వాదన. 

Also Read :- రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే బాంబు బెదిరింపులు

ప్రచారంలో జాతీయ విషయాలే ప్రాధాన్యతాంశాలుగా మారుతాయని అంటున్నారు. జమిలి నిర్వహణకు భారీగా ఈవీఎంలు, వీవీ ప్యాట్లు కొనాల్సి ఉంటుంది. లక్షలాది మంది ఎన్నికల, రక్షణ సిబ్బందిని కేటాయించాలి. వారి శిక్షణ కోసం కూడా ఖర్చు పెట్టాలి. ఎన్నికల సామగ్రిని భద్రపర్చడానికి తగినన్ని గోడౌన్లు లేకపోవడం కూడా సమస్యే.

ఏ ఏడాదిలో.. ఏ రాష్ట్రాల ఎన్నికలో లిస్ట్ ఇదే..
ప్రస్తుత లోక్‌‌‌‌‌‌‌‌సభ గడువు 2029 వరకు ఉంది. కానీ.. ఆలోపు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే.. వాటి అసెంబ్లీ గడువు కాలాన్ని పెంచడం, తగ్గించడం చేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. 2026లో ఐదు రాష్ట్రాల్లో, 2027లో గోవా, ఉత్తరాఖండ్‌‌‌‌‌‌‌‌, పంజాబ్‌‌‌‌‌‌‌‌, మణిపూర్‌‌‌‌‌‌‌‌, యూపీ, హిమాచల్‌‌‌‌‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌, గుజరాత్​లో ఎన్నికలు ఉంటాయి.

ఈ స్టేట్స్‌ ఎన్నికలు ఈ టైంలోనే..
జమిలి ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కార్‌‌‌‌‌‌‌‌ భావిస్తున్నది. 2028లో త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌‌‌‌‌‌‌‌, కర్నాటక, మిజోరాం, ఛత్తీస్‌‌‌‌‌‌‌‌గఢ్‌‌‌‌‌‌‌‌, మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌, రాజస్థాన్‌‌‌‌‌‌‌‌, తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. 2029లో అరుణాచల్‌‌‌‌‌‌‌‌ ప్రదేశ్‌‌‌‌‌‌‌‌, సిక్కిం, ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌, ఒడిశా, జమ్మూ కాశ్మీర్, హర్యానా, జార్ఖండ్‌‌‌‌‌‌‌‌, మహారాష్ట్ర అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎలక్షన్లు జరుగుతాయి.