ఎడపల్లి,వెలుగు: ఎడపల్లి మండలం లోని అలీసాగర్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సాహస క్రీడలు నిర్వహించారు. అడ్వెంచర్స్ సొసైటీ ఇన్చార్జి కొల్ల రంగారావు ఆధ్వర్యంలో రాఫ్టింగ్, గుర్రపు స్వారీ, మోటర్ బోర్డ్ క్రీడలు నిర్వహించారు.
పలు పాఠశాలల నుంచి 120 మందికి విద్యార్థులు పాల్గొన్నట్టు క్లబ్ నిజామాబాద్ అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ ప్రతినిధులు కార్యదర్శి ఎన్ ప్రసన్నకుమారి, రైలా చైర్మన్ జితేంద్ర మలాని, కోశాధికారి, విజయ రావ్, పవన్ పాండే, బాబు రావు, మారయ్య గౌడ్, సతీశ్ షాహ పాల్గొన్నారు.