- బల్దియా అధికారుల యాక్షన్ప్లాన్షురూ
- 80 ట్రాఫిక్ పోలీసుల గొడుగులు..20 బస్ షెల్టర్ల ప్రకటనలు తొలగింపు
హైదరాబాద్: జీహెచ్ఎంసీలో అడ్వర్టైజ్‌మెంట్ అక్రమాలు భారీగా వెలుగులోకి వచ్చాయి. పర్మిషన్ లేకుండా బస్ స్టాపులు, ట్రాఫిక్ గొడుగులపై ప్రకటనలు వెలిశాయి. అక్రమ అడ్వర్టైజ్‌మెంట్‌పై ఈవీడీఎం చర్యలు చేపట్టింది. గత రాత్రి పలు ప్రాంతాల్లో 80 ట్రాఫిక్ పోలీసుల గొడుగులు.. 20 బస్ షెల్టర్ల ప్రకటనలను అధికారులు తొలగించారు. కేబీఆర్ పార్క్ చుట్టు నాలుగు బస్ షెల్టర్లను ఈవీడీఎం పూర్తిగా తొలగించింది.
ఇటీవలే కౌన్సిల్ లో అడ్వర్టైజ్ మెంట్ వందల కోట్ల అక్రమాలు జరిగాయని కార్పొరేటర్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. నిన్ననే ప్రకటనల డీఈ కార్తీక్ పై బదిలీ వేటు పడింది. ప్రకటనల టెండర్ల గడువు ముగిసినా ఎలాంటి ప్రక్రియ లేకుండానే కొత్త కంపెనీలు వచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి హౌస్ కమిటీ వేయగా.. అక్రమ ప్రకటనల తొలగింపునకు బల్దియా అధికారులు చర్యలు చేపట్టారు.