- ప్రొఫెసర్హరగోపాల్ సహా ఆరుగురితో ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: విద్యా కమిషన్కు ముగ్గురు సభ్యులను నియమించిన విద్యాశాఖ..తాజాగా ఆరుగురు సభ్యులతో కూడిన అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది. పేరుపొందిన ప్రొఫెసర్లు, విద్యావేత్తలకు కమిటీలో చోటుకల్పించింది. విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులు, సమగ్రమైన విధివిధానాల రూపకల్పన, మేధోమథనంలో మార్గదర్శనం చేయడం కోసం అకడమిక్ నిపుణులతో ఈ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ మేరకు శనివారం విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ జి. హరగోపాల్, కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్లు కె. మురళీ మనోహర్, కె. వెంకట నారాయణ, శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎస్. సుజాత, ఎంవీఎఫ్ నేషనల్ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి, యునిసెఫ్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ కె.ఎం. శేషగిరిని సభ్యులుగా నియమించారు.
తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ పదవీకాలానికి తగ్గట్టుగా అడ్వైజరీ కమిటీ పదవీ కాలం ఉంటుందని పేర్కొన్నారు.