చెన్నై: చెన్నైకి చెందిన అడ్వొకేట్, యాక్టివిస్ట్ లలితా నటరాజన్ యూఎస్2023 ఇక్బాల్ మసీహ్ అవార్డు అందుకున్నారు. మే 30న చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్‌లో జరిగిన కార్యక్రమంలో యూఎస్ కాన్సుల్ జనరల్ జుడిత్ రవిన్ నటరాజన్ ఈ అవార్డును అందజేశారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఆమె చేసిన కృషికి ఈ అవార్డు లభించింది. లలితా నటరాజన్ తమిళనాడు ప్రభుత్వ సోషల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలిగా.. బాల కార్మిక చట్టం, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం(పోక్సో) కింద బాధితులకు పరిహారం అందేలా చూస్తున్నారు.