
సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ పట్టణానికి చెందిన అడ్వకేట్ ఆవుల శివకృష్ణ మంగళవారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో ఎమ్మెల్యే అడ్వకేట్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ నాయకులు మినుపాల ప్రకాశ్ రావు, అన్నయ్య గౌడ్, డి. దామోదర్ రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరాములు, అడ్వకేట్లు పాల్గొన్నారు.