కాంగ్రెస్ శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తోంది

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ శాంతి భద్రతల సమస్య సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ హైకోర్టు న్యాయవాది రామారావు పిటిషన్ దాఖలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఓయూలో ఎలాంటి ఘటనలు జరగకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అడ్వొకేట్ రామారావు  ఫిర్యాదును స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు ఓకే చెప్పింది.


మే 7న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హైదరాబాద్కు రానున్నారు. ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో సభ నిర్వహించుకునేందుకు వీసీని అనుమతి కోరగా.. ఆయన నిరాకరించారు. కాంగ్రెస్ వ్యతిరేక విద్యార్థి సంఘాలు రాహుల్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం మాత్రం రాహుల్ సభకు అనుమతించాల్సిందేనని పట్టుబడుతోంది. ఈ  క్రమంలో ఓయూలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తల కోసం..

కేసీఆర్ సర్కారుకు సమాధే

టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుచరుడిపై భూ కబ్జా ఆరోపణలు