తిమ్మాపూర్, వెలుగు : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ శివారులోని కాకతీయ ప్రధాన కాలువలో కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన అడ్వకేట్ ద్యావనపల్లి వేణుగోపాల్ రావు గల్లంతయ్యాడు. అతడి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. వేణు బుధవారం తన పిల్లలకు టిఫిన్ బాక్స్ ఇచ్చేందుకు పారమిత స్కూల్కు వెళ్లి రాత్రయినా ఇంటికి రాలేదు.
దీంతో కుటుంబ సభ్యులు వెతికారు. కాకతీయ కాలువ వద్ద టూవీలర్తో పాటు చెప్పులు, మొబైల్ ఉన్నట్టు తెలుసుకొని వెళ్లారు. పోలీసులకు సమాచారం అందించడంతో కాలువలో అతడి కోసం గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.