
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో విషాదం చోటు చేసుకుంది. పుప్పాల్ గూడలో ముఖర్జీ అనే అడ్వకేట్ తన గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ తగాదాల వల్లే బలవన్మరణానికి పాల్పడ్డాని తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా ముఖర్జీ భార్య దూరంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ముఖర్జీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.