చౌటుప్పల్‌కు సబ్‌ కోర్టు కావాలని సివిల్ కోర్టు ముందు అడ్వకేట్ల ధర్నా

చౌటుప్పల్, వెలుగు: చౌటుప్పల్ లో సబ్ కోర్టు ఏర్పాటు చేయడంతో పాటు జీవో నంబర్ 50 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సివిల్ కోర్టు ముందు బుధవారం బార్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో ధర్నా చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ రెండో రెవెన్యూ డివిజన్ అని, అన్ని రకాల ప్రభుత్వ డివిజన్ ఆఫీసర్లు ఇక్కడ ఉన్నాయన్నారు. సబ్ కోర్టును చౌటు ప్పల్ ఏర్పాటు చేయడం వల్ల కక్షిదారులు,

న్యాయవాదులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. రామన్నపేటలో సబ్ కోర్ట్ ని ఏర్పాటు చేస్తూ వెలుబడిన జీవో నం 50ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మూడు రోజులపాటు కోర్టును బాయ్ కాట్ చేస్తున్నా మని తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసి యేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి రాబోలు వేణు, ఉపాధ్యక్షుడు తాడూరి పరమేశ్, రమేశ్, సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.