- న్యాయవాదిపై సిద్దిపేట పోలీసులు దాడి చేశారని ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: హైకోర్టులో కొందరు అడ్వకేట్లు నిరసనకు దిగారు. కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ ఆర్డర్ కాపీని అందజేయడానికి వెళ్లిన న్యాయవాది రవికుమార్‌పై సిద్దిపేట సీఐ డైరక్షన్‌లో ఏఎస్‌ఐ ఉమారెడ్డి, ఇతర పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనపై హైకోర్టు బార్ అసోసియేషన్ కూడా సమావేశమై నిరసన తెలిపింది. అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యాడపు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాది రవికుమార్ ఎదుటే ఓ కేసులో నిందితుడిపై పోలీసులు దాడి చేశారని..దాన్ని అడ్డుకున్నందుకు రవికుమార్ పై కూడా దాడి చేశారని తెలిపారు.
న్యాయవాది ఫోన్‌ను లాక్కోవడమే కాకుండా తీవ్రంగా గాయపరిచారని వివరించారు. దాడి చేసిన పోలీసులే.. తిరిగి రవికుమార్‌పై కేసు మోపడం దారుణమన్నారు. ఆ కేసును రద్దు చేయాలని, ఏఎస్‌ఐతో పాటు తప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదుకు బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వీరిపై కేసు నమోదు చేయాలని కోరారు.