అక్టోబర్ 22 నుంచి ఏఈ సర్టిఫికెట్ వెరిఫికేషన్

అక్టోబర్  22 నుంచి ఏఈ  సర్టిఫికెట్ వెరిఫికేషన్

హైదరాబాద్, వెలుగు: అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 22 నుంచి ప్రారంభమవుతుందని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ సోమవారం తెలిపారు.

 పబ్లిక్ హాలిడేస్ మినహాయించి నవంబర్ 5వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అభ్యర్థులు హాజరవ్వలేని పరిస్థితుల్లో వారికి నవంబర్ 6న వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని తెలిపారు. నాంపల్లి పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో వెరిఫికేషన్ కొనసాగుతుందన్నారు. వివరాలకు http://www.tspsc.gov.in వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు.