
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్ పట్టభద్రులు ఈ పోస్టులకు అర్హులు. మొత్తం 1540 ఏఈఈ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.
పోస్టులు: మొత్తం 1540 పోస్టుల్లో ఏఈఈ(సివిల్)- పీఆర్ & ఆర్‌డీ డిపార్ట్‌మెంట్ (మిషన్ భగీరథ) విభాగంలో 302, ఏఈఈ(సివిల్)- పీఆర్ & ఆర్‌డీ డిపార్ట్‌మెంట్‌లో 211, ఏఈఈ (సివిల్) ఎంఏ & యూడీ- పీహెచ్‌లో 147, ఏఈఈ(సివిల్) టీడబ్ల్యూ డిపార్ట్‌మెంట్‌లో 15, ఏఈఈ ఐ & సీఏడీ డిపార్ట్‌మెంట్‌లో 704, ఏఈఈ (మెకానికల్) ఐ & సీఏడీ(జీడబ్ల్యూడీ) విభాగంలో 3, ఏఈఈ (సివిల్) టీఆర్ & బి విభాగంలో 145, ఏఈఈ (ఎలక్ట్రికల్) టీఆర్ & బి పరిధిలో 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అర్హత: పోస్టును అనుసరింలచి బ్యాచిలర్ డిగ్రీ (సివిల్ ఇంజినీరింగ్/ మెకానికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ అగ్రికల్చర్ ఇంజినీరింగ్) తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 15 వరకు అప్లై చేసుకోవాలి. వివరాలకు www.tspsc.gov.in లో సంప్రదించాలి.