రైతు బీమా సొమ్ము కొట్టేసిన ఏఈఓ .. కురివి పోలీస్ స్టేషన్ లో బాధితురాలి పిర్యాదు

రైతు బీమా సొమ్ము కొట్టేసిన ఏఈఓ .. కురివి పోలీస్ స్టేషన్ లో బాధితురాలి పిర్యాదు

కురవి, వెలుగు : చనిపోయియిన రైతు కుటుంబానికి అందాల్సిన రైతు బీమా సొమ్మును ఏఈఓ కొట్టేసిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో ఆలస్యంగా తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. కురవి మండలం గుండ్రాతి మడుగు గ్రామానికి చెందిన గిరిజన రైతు బానోతు బాలు అనారోగ్యంతో గత జూన్ 9న మృతిచెందాడు. రైతు బంధు బీమాకు నామినీగా భార్య ఇరానీ పేరున గత అక్టోబర్18న రూ. 5 లక్షలు ఖాతాలో జమ అయ్యాయి. ఇది తెలిసిన ఏఈఓ కళ్యాణ్ ఆమెకు మాయ మాటలు చెప్పి బ్యాంకు కాగితాలపై సంతకాలు చేయించుకొని మరుసటి రోజు తన అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేయించాడు. 

అనంతరం కొద్దిరోజులకు తనకు రూ .5 లక్షలు వచ్చినది ఇరానీ తెలుసుకుంది. వెంటనే ఆమె ఏఈఓను అడిగింది. అతను స్పందించకపోవడంతో బ్యాంకుకు వెళ్లి అధికారులను అడగగా... రూ. 5 లక్షలు వచ్చినట్టు, ఏఈఓకళ్యాణ్ అకౌంట్ కు  బదిలీ అయినట్లు తెలిపారు. మళ్లీ ఆమె ఏఈఓను ప్రశ్నించగా వారం రోజుల్లో డబ్బు ఇస్తానంటూ ఈనెల10న చెక్కు ఇచ్చాడు. బ్యాంకుకు వెళ్లి వేయగా ఖాతాలో డబ్బులు లేకపోవడంతో బౌన్స్ అయింది. ఏఈఓ మోసం చేశాడంటూ బాధితురాలు ఇరానీ రెండు రోజుల కురవి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 

మండల వ్యవసాయ అధికారులకు కూడా చెప్పడంతో మంగళవారం ఏడీఏ విజయ్ చంద్ర, కురవి ఏవో నరసింహారావు మంగళవారం విచారణ చేసి జిల్లా వ్యవసాయ అధికారికి రిపోర్ట్ అందజేసిన తెలిపారు. గతేడాది మండలంలోని అయ్యగారి పల్లిలో సైతం రూ. 5 లక్షలు ఏఈఓ కళ్యాణ్ మోసం చేసి తీసుకోగా.. బాధితురాలు తిరగబడడంతో చెల్లించినట్లు తెలిసింది.