న్యూఢిల్లీ: బ్యాటరీ సెల్‌ల అభివృద్ధి, సరఫరా కోసం అమర రాజా అడ్వాన్స్‌డ్ సెల్ టెక్నాలజీస్‌తో కలసి పనిచేస్తామని ఎలక్ట్రిక్ టూవీలర్స్ తయారీ సంస్థ ఎథర్ ఎనర్జీ గురువారం తెలిపింది. ఇందుకోసం అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ పూర్తి అనుబంధ సంస్థ అయిన అమర రాజా అడ్వాన్స్‌డ్ సెల్ టెక్నాలజీస్ తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు తెలిపింది.
ఎంఓయూ ప్రకారం, అమర రాజా ఎన్‌ఎంసీ (నికెల్ మాంగనీస్ కోబాల్ట్), ఎల్‌ఎఫ్‌సీ (లిథియం ఐరన్ ఫాస్ఫేట్), లిథియం- అయాన్ (లీఅయాన్), ఇతర అధునాతన కెమిస్ట్రీ సెల్స్‌ను అభివృద్ధి చేయడానికి, సరఫరా చేయడానికి ఎథర్‌తో కలసి పనిచేస్తుందని ఎథర్ ఎనర్జీ కో–-ఫౌండర్, సీఈఓ తరుణ్ మెహతా చెప్పారు. ఈ ఒప్పందం వల్ల తమ ఖర్చులు తగ్గుతాయని చెప్పారు