
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పర్మనెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్‌లలో ఉద్యోగాల భర్తీకి నిర్వ హించే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్ క్యాట్) ప్రకటన విడుదలైంది. ఏటా మే/ జూన్, డిసెంబరు నెలల్లో ఈ ప్రకటన వెలువడుతుంది. ఈసారి అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 249 ఖాళీలు ఉన్నాయి. ఏఎఫ్ క్యాట్‌లో ప్రతిభ చూపితే ఎయిర్‌ఫోర్స్‌లోని ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్), ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ (ఫ్లయింగ్) బ్రాంచుల్లో ప్రవేశించొచ్చు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
విభాగాలు: ఫ్లైయింగ్ , గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్ ), ఎన్‌సీసీ స్పెష ల్ ఎంట్రీ (ఫ్లైయింగ్ ), మెటియొరాలజీ.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ , బీకాం, పీజీ ఉత్తీరత్ణతో పాటు ఎన్‌సీసీ సర్ ఫిటి కెట్, నిర్దేశించిన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: ఫ్లైయింగ్ బ్రాంచు పోస్టులకు1997 జనవరి 2 నుంచి 2001 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ /నాన్ టెక్నికల్) పోస్టులకు 1995 జనవరి 2 నుంచి 2001 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్ : కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ , ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ), పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ (పీఏబీటీ), మెడికల్ టెస్ట్ ద్వారా ఫీజు: ఏఎఫ్ క్యాట్ ఎంట్రీ పోస్టులకు రూ.250.
ఎన్ సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టులకు ఫీజు లేదు
దరఖాస్తు ప్రారంభం: 2019 డిసెంబర్ 1
చివరి తేది: 2019 డిసెంబర్ 30
కోర్సు ప్రారంభం: 2021 జనవరి వెబ్ సైట్: www.afcat.cdac.in