పట్టాలు ధరణిలో ఎంట్రీ చేయాలి : రాష్ట్ర కమిటీ సభ్యులు జయరాజ్

పట్టాలు ధరణిలో ఎంట్రీ చేయాలి : రాష్ట్ర కమిటీ సభ్యులు జయరాజ్

సంగారెడ్డి టౌన్, వెలుగు: సంగారెడ్డి మండలం మాందాపూర్ గ్రామంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రైతులకు ఇచ్చిన పట్టాలను ధరణిలో నమోదు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జయరాజ్ డిమాండ్ చేశారు. సోమవారం బాధిత రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి ప్రభుత్వం గ్రామంలోని 22 సర్వే నెంబర్‌‌‌‌లో పేదల రైతులకు ఎకరా, అరెకర చొప్పున భూములు అసైన్డ్‌‌ చేసి పట్టాలు అందించిందని గుర్తు చేశారు. 

 బీఆర్‌‌‌‌ఎస్‌‌ ప్రభుత్వం ధరణిలో రైతుల పేర్లు నమోదు చేయకపోవడంతో రైతుబంధు, రైతు బీమా పథకాలకు దూరం అయ్యాయని వాపోయారు.  అధికారులు స్పందించి సాగులో ఉన్న రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజయ్య, కార్మిక పరదేశి నర్సింలు , రైతులు అమృతమ్మ, కమలమ్మ, ఏసన్న, చంద్రయ్య, అనిత, రాములమ్మ, తదితరులు పాల్గొన్నారు.