పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 25 వే ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వంలో రైతులకు రూ. 10 వేలు ఇస్తే ఎద్దేవా చేశారని గుర్తుచేశారు. సూర్యాపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతుల తరుపున అడిగే వారు లేరని అనుకోవద్దని.. రణరంగమైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేడలు వంచుతామన్నారు కేసీఆర్. రైతుల తరుపున పోరాటం చేస్తామన్నారు కేసీఆర్. కాంగ్రెస్ నాయకులు అసమర్థత వల్లనే పంటలు ఎండుతున్నాయని విమర్శించారు.
వ్యవసాయంలో నెంబర్ వన్ గా ఎదిగిన తెలంగాణ మూడు నెలల్లోనే దిగజారిందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. వంద రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని రైతులు బాధపడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో పంజాబ్ కు పోటీ పడలే పంట పండిందన్నారు. మూడు నెలల్లోనే తెలంగాణలో రైతులకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదన్నారు.
ప్రభుత్వ అసమర్థత, అలసత్వం కారణంగానే ఈ దుస్థితి తలెత్తిందన్నారు కేసీఆర్. మళ్లీ జనరేటర్లు, ఇన్వెర్టర్లు, కన్వర్టర్లు వస్తున్నాయన్నారు. హైదరాబాద్‌ను పవర్ ఐలాండ్ సిటీగా తాము మార్చామని.. రాత్రింబళ్లు కొట్లాడి నేషనల్ పవర్ గ్రిడ్‌కు అనుసంధానం చేయించామని తెలిపారు. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు.