భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ అదరగొట్టింది. ఇండోర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో పటిష్టమైన భారత బౌలర్లను ఎదుర్కొంటూ భారీ స్కోర్ చేశారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. ప్రారంభం నుంచి ఆఫ్గన్ భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. ఈ క్రమంలో పవర్ ప్లే లో జట్టు స్కోర్ 50 పరుగులు దాటింది.
నైబ్ 35 బంతుల్లోనే 57 పరుగులు చేసి భారత బౌలర్లపై ఆధిపత్యం చూపించాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు పడినా.. చివర్లో కరీం జనత్ (10 బంతుల్లో 20), ముజీబుర్ రెహమాన్ (9 బంతుల్లో 21) చెలరేగి ఆడారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసుకోగా.. బిష్ణోయ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. దూబేకు ఒక వికెట్ లభించింది.