క్రికెట్ ప్రపంచంలో నబీ సరికొత్త చరిత్ర.. 45 దేశాలపై విజయాలు

క్రికెట్ ప్రపంచంలో నబీ సరికొత్త చరిత్ర.. 45 దేశాలపై విజయాలు

ఇప్పటికే పసికూన అనే ట్యాగ్ లైన్ ను తుడిచేసుకున్న ఆఫ్ఘన్ జట్టు.. ఇప్పుడు అగ్రశ్రేణి జట్లకు షాకులివ్వడం మొదలు పెట్టింది. గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లోనే సంచలన ప్రదర్సన చేసింది. బలమైన పాకిస్తాన్, శ్రీలంక జట్లను ఓడించి తమ ఉనికిని ఘనంగా చాటుకుంది. అయినప్పటికీ, మేటి జట్లు జాగ్రత్త పడలేదు. దీంతో రషీద్ సేన మరోసారి పంజా విసిరింది. 

అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ లో రెండుసార్లు విశ్వవిజేత ఆస్ట్రేలియాను మట్టి కురిపించింది. ఈ విజయంతో ఆ జట్టు వెటరన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. 45 దేశాలపై జట్టు సాధించిన విజయాలలో భాగమయ్యాడు.

పట్టుమని పది

ఇండియా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్.. ఇలా లెక్కపెడితే క్రికెట్ ఆడే దేశాలు పదే పది గుర్తొస్తాయి. అలాంటిది 45 దేశాలపై ఆఫ్గనిస్తాన్ జట్టు విజయాలు సాధించింది అంటే మామూలు విషయం కాదు. డెన్మార్క్, బహ్రెయిన్, మలేషియా, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఇరాన్.. ఇలా అన్నీ దేశాలతోనూ తలపడ్డారు. విజయం సాధించారు. 

ఆఫ్ఘన్లు విజయాలు సాధించిన 45 దేశాలలో ఐర్లాండ్, జింబాబ్వే, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పూర్తి స్థాయి ఐసీసీ సభ్య దేశాలు కావడం గమనార్హం.

నబీ తన కెరీర్‌లో ఓడించిన 45 దేశాలు

డెన్మార్క్, బహ్రెయిన్, మలేషియా, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఇరాన్, థాయిలాండ్, జపాన్, బహమాస్, బోట్స్వానా, జెర్సీ, ఫిజి, టాంజానియా, ఇటలీ, అర్జెంటీనా, పపువా న్యూ గినియా, కేమాన్ దీవులు, ఒమన్, చైనా, సింగపూర్, పాకిస్తాన్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, యునైటెడ్ స్టేట్స్, భూటాన్, మాల్దీవులు, బార్బడోస్, ఉగాండా, బెర్ముడా, ఐర్లాండ్, స్కాట్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్, కెనడా, కెన్యా, హాంగ్ కాంగ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జింబాబ్వే, వెస్టిండీస్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా.