ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన క్రికెటర్ రషీద్ ఖాన్.. భారత బ్యాట్స్‌మెన్, జార్ఖండ్ డైనమేట్ ఎంఎస్ ధోనిని ఫాలో అవుతున్నాడు. ధోని హెలికాప్టర్ షాట్ ఎంత ఫేమసో తెలియంది కాదు. ఆ షాట్‌ను తనదైన స్టైల్‌లో ఆడిన రషీద్ ఖాన్.. ధోని షాట్ గుర్తుకు వచ్చేలా చేశాడు. రషీద్ ఖాన్ కొట్టిన ఆ షాట్‌ను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్టు చేశాడు. అందులో వికెట్ల వెనుకవైపు హెలికాప్టర్ షాట్ ఆడుతున్నట్లు కనిపిస్తుంది. తన ఈ షాట్ గురించి మీరు ఏమనుకుంటున్నారని రషీద్ అభిమానులనుద్దేశించి అడిగాడు. అంతేకాకుండా.. మీరు దీనిని ‘హెలికాప్టర్ షాట్ అని పిలుస్తారా’ అని కూడా ప్రశ్నించాడు. అయితే రషీద్ ట్వీట్‌కు స్పందించిన జట్టు సహచరుడు హమీద్ హసన్ ఆ షాట్‌కు ‘నింజా కట్’ అని సమాధానమిచ్చాడు.
రషీద్ పోస్టు చేసిన ఈ వీడియోను.. రషీద్ ఖాన్ ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. రషీద్ చివరిసారిగా ఫిబ్రవరి 1న ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరపున ఆడాడు.
సాంప్రదాయ హెలికాప్టర్ షాట్ సాధారణంగా మిడ్-వికెట్ మీదుగా లాంగ్-ఆన్‌లో లెగ్ సైడ్ వెళుతుంది. కానీ.. రషీద్ షాట్ మాత్రం థర్డ్ మ్యాన్ మీదుగా వెళ్ళింది. అందుకే చాలా మంది రషీద్ షాట్‌ను ‘రివర్స్ హెలికాప్టర్ షాట్’ అంటూ సమాధానమిస్తున్నారు.
Do you call it helicopter?? I think soo ??? pic.twitter.com/DXYL15TSS1
— Rashid Khan (@rashidkhan_19) March 2, 2020