కాబూల్: అఫ్ఘాన్ మహిళల నిరసనలను కవర్ చేసినందుకు జర్నలిస్టులను తాలిబన్లు చితక్కొట్టారు. దర్యాబి మరియు నఖ్దీ అనే ఒక వీడియో ఎడిటర్ మరియు ఒక రిపోర్టర్ బుధవారం పశ్చిమ కాబూల్‌లోని కార్ట్ -ఇ -చార్ అనే ప్రాంతంలో మహిళలు నిర్వహించిన నిరసనను కవర్ చేశారు. ఫోటోలు, వీడియోలు తీస్తుండగా.. వారిని తాలిబన్లు పట్టుకొని కట్టేసి విపరీతంగా కొట్టారు. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాలిబన్ల దెబ్బలకు గాయపడిన జర్నలిస్టుల యొక్క ఫోటోలు అఫ్ఘాన్‌లో మానవ హక్కులకు మరియు పత్రికా స్వేచ్ఛకు భంగం ఎంతగా వాటిల్లుతుందో తెలియజేస్తున్నాయి.
‘మేం జర్నలిస్టులమని అరుస్తూ చెప్పినా వారు పట్టించుకోలేదు. వారు మమ్మల్ని చంపేస్తారని అనుకున్నాను. వారు మమ్మల్ని ఎగతాళి చేస్తూ.. కొడుతూనే ఉన్నారు’ అని బాధితుడు నఖ్దీ చెప్పారు.
Send our journalists to hospital. pic.twitter.com/W3GQ34BPtl
— Zaki Daryabi (@ZDaryabi) September 8, 2021