ఆఫ్గనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్ రూ.4.80 కోట్ల ధర పలికాడు. కనీస ధర రూ. రూ.75 లక్షలతో వేలంలోకి వచ్సిన ఈ ఆఫ్ఘన్ స్పిన్నర్ కోసం కేకేఆర్, ఆర్‌సీబీ నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డాయి. అయితే, ధర రూ. 2 కోట్లు పైబడగానే బెంగళూరు వెనక్కి తగ్గగా.. ముంబై రేసులోకి వచ్చింది.
ఇటీవల జరిగిన ఎమర్జింగ్ ఆసియా కప్, ఆఫ్ఘన్ దేశవాళీ టోర్నీల్లో ఘజన్‌ఫర్ అద్భుత ప్రదర్శన కనపరిచాడు. ముఖ్యంగా, పవర్ ప్లేలో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయడంలో మంచి దిట్ట. అందువల్ల ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ ఇరు ఫ్రాంచైజీలు వెనక్కి తగ్గలేదు. చివరకు రూ. 4.80 కోట్లకు ఘజన్‌ఫర్‌ను ముంబై దక్కించుకుంది.
Batters be like... 𝙸𝚍𝚊𝚛 𝚌𝚑𝚊𝚕𝚊, 𝚞𝚍𝚊𝚛 𝚌𝚑𝚊𝚕𝚊, 𝚓𝚊𝚊𝚗𝚎 𝚔𝚊𝚑𝚊 𝚋𝚊𝚕𝚕 𝚌𝚑𝚊𝚕𝚊 🤔💥#MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPLAuctionpic.twitter.com/y6LMt3ZNVw
— Mumbai Indians (@mipaltan) November 25, 2024
Also Read : చెన్నై to ముంబై.. భారీ ధర పలికిన ధోని శిష్యుడు
గత ఐపీఎల్ రికార్డులు
అల్లా ఘజన్‌ఫర్ గతంలో 2023, 2024 సీజన్లలో వేలం కోసం తన పేరు నమోదు చేసుకున్నప్పటికీ, రెండింటిలోనూ అమ్ముడుపోలేదు. అనంతరం కోల్‌కతా ముజీబ్ ఉర్ రెహ్మాన్‌కు బదులుగా ఇతన్ని జట్టులోకి తీసుకుంది. అయితే, సీజన్ మొత్తంలో ఆడే అవకాశమే రాలేదు. ఈ మధ్యనే ఇతడు ఆఫ్గనిస్తాన్ తరుపున వన్డేల ద్వారా అంతర్జాతీయ అరంగ్రేటం చేశాడు.