ఆఫ్ఘనిస్తాన్ టాప్ జట్లలో ఒకటిగా అవతరిస్తుంది. సీనియర్ జట్టు పెద్ద జట్లకు షాకిస్తూ సంచలనాల విజయాలు సాధిస్తున్న సంగతి తెలిసిందే. జూనియర్ జట్టు కూడా వారిని మించేలా ఆడుతూ సరి కొత్త చరిత్ర సృష్టించింది. ఏసీసీ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టీ20 టైటిల్ ను గెలుచుకొని తొలిసారి ఈ టైటిల్ తమ ఖాతాలో వేసుకుంది. ఏకపక్షంగా సాగిన ఫైనల్లో శ్రీలంక-ఏపై అఫ్గానిస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
134 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్థాన్ ఎక్కడా తడబడకుండా ఆడింది. లక్ష్యం చిన్నది కావడంతో ఆడుతూ పాడుతూ బ్యాటింగ్ చేశారు. మరో 11 బంతులు మిగిలి ఉండగానే 18.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేజ్ చేశారు. సెదికుల్లా అటల్ 55 పరుగులతో అజేయంగా నిలిచి అఫ్గాన్ జట్టుకు విజయాన్ని అందించాడు. కరీం జనత్ (33), కెప్టెన్ దర్విష్ రసూలీ (24)రాణించారు.
Also Read:-శ్రీలంకతో మూడో వన్డేలో వెస్టిండీస్‌కు ఊరట విజయం
అంతకముందు మొదట బ్యాటింగ్కు చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది. సహన్ అరచ్చిగే 64 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతను తప్ప మిగిలిన వారు విఫలమయ్యారు. ఆఫ్గన్ బౌలర్లలో బిలాల్ సమీ (3/22), అల్లా ఘజన్‌ఫర్ (2/14) అద్భుతంగా బౌలింగ్ చేసి లంకను కట్టడి చేశారు. అల్లా గజన్‌ఫర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్.. సెడిఖుల్లా అటల్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.