T20 Semi-final: చెలరేగిన దక్షిణాఫ్రికా బౌలర్లు.. 56 పరుగులకే ఆఫ్గాన్ ఆలౌట్

T20 Semi-final: చెలరేగిన దక్షిణాఫ్రికా బౌలర్లు.. 56 పరుగులకే ఆఫ్గాన్ ఆలౌట్

టీ20 ప్రపంచప్ కప్ కీలక సెమీఫైనల్‌1లో అఫ్గానిస్థాన్ జట్టు ఘోరంగా విఫలమైంది. 2024, జూన్ 27వ తేదీ గురువారం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్ లో ఆఫ్గాన్ జట్టు 11.5 ఓవర్లలో కేవలం 56 పరుగులకే చెతులెత్తేసింది. 

ఆఫ్గాన్ బ్యాట్స్ మెన్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్‌(10) మినహా మిగతా వారెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. నబీ (0), జనత్‌ (8), నూర్ ఆహ్మద్‌ (0), నవీనుల్‌ హక్‌ (2), కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ (8)లు దారుణంగా విఫలమయ్యారు.  దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్‌సెన్‌, షంసీ చెరో 3 వికెట్లు తీయగా.. రబాడా, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టారు.  టీ20 ప్రపంచకప్ లో ఇప్పటివరకు అసాధారణ ప్రతిభ కనబరిచిన అఫ్గాన్‌ కీలక మ్యాచ్‌లో బోల్తాపడింది. దాదాపు ఆఫ్గాన్ కథ ముగిసినట్లే.