జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ముగ్గురు రిజర్వ్ ప్లేయర్లతో కలిపి 18 మందికి చోటు కల్పించింది. ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 2022జట్టుతో పోలిస్తే ఆఫ్ఘనిస్తాన్ తమ జట్టులో కొన్ని చేర్పులు చేసింది. కాగా జూన్ 1 నుంచి జూన్ 29 వరకు టీ20 వరల్డ్ కప్ జరగనుంది. మొత్తం 20 జట్లు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ జట్టు:
రషీద్ ఖాన్ (c), రహ్మానుల్లా గుర్బాజ్ (wk), ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ ఇషాక్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నాయబ్, కరీం జనత్, నంగ్యాల్ ఖరోటీ, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్ , ఫజల్హాక్ ఫరూఖీ, ఫరీద్ అహ్మద్ మాలిక్. రిజర్వ్‌లు: సెదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీమ్ సఫీ