ఔరా అఫ్గాన్..టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లోతొలిసారి సెమీస్‌‌‌‌‌‌‌‌కు

ఔరా అఫ్గాన్..టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లోతొలిసారి సెమీస్‌‌‌‌‌‌‌‌కు
  • బంగ్లాపై థ్రిల్లింగ్‌‌‌‌‌‌‌‌ విక్టరీ
  • సత్తా చాటిన గుర్బాజ్, నవీన్‌‌‌‌‌‌‌‌, రషీద్
  • ఆస్ట్రేలియా ఇంటిదారి

నిత్యం తుపాకీ శబ్దాలు, తాలిబాన్ల  ఆంక్షలు, అకృత్యాలతో అనిశ్చితి, అశాంతితో రగిలిపోతున్న దేశం వారిది. స్వదేశంలో కనీసం క్రికెట్ ఆడలేని పరిస్థితి ఆ ఆటగాళ్లది. పరిమిత వనరులతో పరాయి దేశాల సపోర్టుతో ముందుకెళ్తున్న అఫ్గానిస్తాన్ క్రికెటర్లు తమ దేశం గర్వపడేలా చేశారు.  అంచనాలు తలకిందులు చేస్తూ.. అసాధారణ ఆటతో మేటి జట్లను వెనక్కి నెడుతూ టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో తొలిసారి సెమీఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరుకున్నారు. గత పోరులో బలమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించిన అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ వీరులు అదే జోరుతో బంగ్లాదేశ్ పని పట్టారు. అత్యంత హోరాహోరీగా సాగిన సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-8 ఆఖరాటలో  సూపర్ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేసిన కాబూలీలు.. రేపు సౌతాఫ్రికాతో సెమీఫైనల్ ఫైట్‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యారు.


కింగ్స్ టౌన్‌‌‌‌‌‌‌‌ : అఫ్గానిస్తాన్ మరో అద్భుతం చేసింది. తమ దేశ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఓ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో సెమీఫైనల్ చేరుకొని ఔరా అనిపించింది. ఉత్కంఠగా  సాగిన  సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–8 చివరి మ్యాచ్‌‌ లో  బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌పై గెలిచిన కాబూలీలు.. 2021 చాంపియన్స్ కంగారూలను ఇంటిదారి పట్టించి టీ20 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో నాకౌట్‌‌‌‌‌‌‌‌ రౌండ్‌‌‌‌‌‌‌‌లో అడుగుపెట్టారు. మంగళవారం వర్షం పలుమార్లు అంతరాయం కలిగించిన పోరులో కెప్టెన్ రషీద్ ఖాన్ (4/23), నవీన్‌‌‌‌‌‌‌‌ ఉల్‌‌‌‌‌‌‌‌ హక్‌‌‌‌‌‌‌‌ (4/26) సూపర్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌తో  చిన్న టార్గెట్‌‌‌‌‌‌‌‌ను కాపాడుకున్న అఫ్గాన్ డక్‌‌‌‌‌‌‌‌వర్త్ లూయిస్‌‌‌‌‌‌‌‌ పద్ధతిలో 8 రన్స్ తేడాతో బంగ్లాపై గెలిచింది.

నాలుగు పాయింట్లతో గ్రూప్‌‌‌‌‌‌‌‌–1లో రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌ సాధించింది. గురువారం ఉదయం జరిగే తొలి సెమీస్‌‌‌‌‌‌‌‌లో సౌతాఫ్రికాతో పోటీ పడనుంది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌కు వచ్చిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 115/5 స్కోరు మాత్రమే చేసింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (55 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 43) సత్తా చాటాడు.  చివర్లో రషీద్ ఖాన్ (10 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 3 సిక్సర్లతో 19 నాటౌట్‌‌‌‌‌‌‌‌) విలువైన రన్స్‌‌‌‌‌‌‌‌ చేశాడు.  బంగ్లా బౌలర్లలో రిషద్ హుస్సేన్ (3/25) మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్ (1/12), ముస్తాఫిజుర్​ (1/17) కట్టడి చేశారు.  

వర్షం కారణంగా బంగ్లా టార్గెట్​ను 19 ఓవర్లలో 114 రన్స్‌‌‌‌‌‌‌‌గా లెక్కగట్టగా.. ఆ జట్టు 17.5 ఓవర్లలో 105 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. ఓపెనర్ లిటస్ దాస్ (49 బాల్స్‌‌‌‌‌‌‌‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌‌‌‌‌‌‌‌తో 54 నాటౌట్) ఆఖరి వరకూ పోరాడినా ఫలితం లేకపోయింది. నవీన్‌‌‌‌‌‌‌‌ ఉల్‌‌‌‌‌‌‌‌ హక్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్​ ద మ్యాచ్ అవార్డు లభించింది.

గుర్బాజ్‌‌‌‌‌‌‌‌ ఒక్కడే

ఆస్ట్రేలియాపై సెంచరీ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌తో సత్తా చాటిన ఓపెనర్లు గుర్బాజ్‌‌‌‌‌‌‌‌, ఇబ్రహీం జద్రాన్ (18) ఈ పోరులో తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 59 రన్స్ జోడించారు. కానీ ఇందుకు 11 ఓవర్లు తీసుకున్నారు. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేయడంతో  ఇద్దరూ నెమ్మదిగా ఆడారు. 9 రన్స్​ వద్ద క్యాచ్ ఔట్ నుంచి తప్పించుకున్న జద్రాన్‌‌‌‌‌‌‌‌ వేగం పెంచే ప్రయత్నంలో స్పిన్నర్ రిషద్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో తంజిమ్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రిషద్ తర్వాతి ఓవర్లోనే రెండు ఫోర్లు కొట్టిన గుర్బాజ్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌కు ఊపు తెచ్చే ప్రయత్నం చేశాడు.

కాసేపు అతనికి సపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన ఒమర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జాయ్ (10)ను 16వ ఓవర్లో ముస్తాఫిజుర్ ఔట్‌‌‌‌‌‌‌‌ చేయగా. తర్వాతి ఓవర్లోనే  గుర్బాజ్‌‌‌‌‌‌‌‌తో పాటు గుల్బదిన్ నైబ్ (4)ను పెవిలియన్ చేర్చిన రిషద్ అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ను దెబ్బకొట్టాడు. ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్  మహ్మద్ నబీ (1) కూడా నిరాశపరిచాడు. తస్కిన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో శాంటోకు క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్లో సిక్స్‌‌‌‌‌‌‌‌ కొట్టిన రషీద్ ఖాన్​.. తంజిమ్‌‌‌‌‌‌‌‌ వేసిన ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లతో స్కోరు 110 దాటించాడు.

ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో హైడ్రామా..

వర్షంతో ఆగుతూ సాగిన ఛేజింగ్ థ్రిల్లర్ సినిమాను తలపించింది.  116 రన్స్ టార్గెట్‌‌‌‌‌‌‌‌ను 12.1 ఓవర్లలో ఛేజ్‌‌‌‌‌‌‌‌ చేస్తే బంగ్లాదేశ్ సెమీస్‌‌‌‌‌‌‌‌ వెళ్లేది. నవీన్ వేసిన తొలి ఓవర్లోనే లిటన్ దాస్‌‌‌‌‌‌‌‌ 4, 6 బాదడంతో బంగ్లా జట్టులో  ఆశలు రేగాయి. కానీ, రెండో ఓవర్లోనే మరో ఓపెనర్ తంజిద్ హసన్ (0)ను ఫజల్ హక్ డకౌట్‌‌‌‌‌‌‌‌ చేయగా.. వరుస బాల్స్‌‌‌‌‌‌‌‌లో కెప్టెన్ నజ్ముల్ శాంటో (0), హిట్టర్ షకీబ్ (0)ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌ చేర్చిన నవీన్ బంగ్లాకు షాకిచ్చాడు. మధ్యలో వర్షం రావడంతో ఆటకు కొద్దిసేపు బ్రేక్ వచ్చింది. తిరిగి మొదలైన తర్వాత సౌమ్య సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (10)తో కలిసి లిటన్ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేను 46/3తో ముగించాడు.

కెప్టెన్ రషీద్ తన వరుస ఓవర్లో సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, తౌహిద్ (14)ను ఔట్ చేసి  అఫ్గాన్‌‌ను రేసులోకి తెచ్చాడు.  కానీ, లిటన్ జోరుతో సగం ఓవర్లకు 77/5తో నిలిచిన బంగ్లా విజయం దిశగా అడుగులు వేసింది. ఈ టైమ్‌‌లో  వరుస బాల్స్‌‌‌‌‌‌‌‌లో మహ్ముదుల్లా (6), రిషద్ హుస్సేన్‌‌ (0)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేసిన రషీద్ ఆ జట్టుకు బ్రేకులు వేశాడు. కానీ, మరోసారి వర్షం రావడంతో బంగ్లా టార్గెట్‌‌‌‌‌‌‌‌ను సవరించారు. రషీద్‌‌‌‌‌‌‌‌తో పాటు మరో స్పిన్నర్ నూర్ అహ్మద్ (0/13) పొదుపుగా బౌలింగ్ చేశాడు. తంజిమ్ (3)ను నైబ్ ఎనిమిదో వికెట్‌‌‌‌‌‌‌‌గా పెవిలియన్ చేర్చడంతో బంగ్లా 92/8తో నిలిచింది.  

కానీ, నూర్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో ఫోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న లిటన్.. తస్కిన్ (2)తో కలిసి స్కోరు  వంద దాటించడంతో బంగ్లా ఆశలు కోల్పోలేదు. చివరి 12 బాల్స్‌‌‌‌‌‌‌‌లో  ఆ జట్టుకు  12 రన్స్‌‌‌‌‌‌‌‌ అవసరం అయ్యాయి. 18వ ఓవర్లో నవీన్‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్ స్లో బాల్‌‌‌‌‌‌‌‌ను తస్కిన్ వికెట్ల మీదకు ఆడుకొని బౌల్డ్ అయ్యాడు. తర్వాతి బాల్‌‌కే ముస్తాఫిజుర్ (0)ఎల్బీ అవడంతో అఫ్గాన్‌‌‌‌‌‌‌‌ సంబరాలు మొదలయ్యాయి.

నైబ్‌‌‌‌‌‌‌‌ ‘నటన’!

బంగ్లా ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ 12వ ఓవర్లో అఫ్గాన్ బౌలర్ గుల్బదిన్ నైబ్‌‌‌‌‌‌‌‌  కండరాలు పట్టేశాయంటూ కింద పడిపోవడం చర్చనీయాంశమైంది.  బంగ్లా 81/7తో ఉన్నప్పుడు చినుకులు మొదలవగా  డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రకారం ఆ టీమ్ రెండు పరుగుల వెనుకంజలో ఉంది.ఈ నేపథ్యంలో టైమ్ వేస్ట్ చేయాలంటూ డగౌట్‌‌‌‌‌‌‌‌ నుంచి అఫ్గాన్ కోచ్ జోనొథన్ ట్రాట్ ప్లేయర్లకు సూచించాడు. దాంతో  స్లిప్‌‌‌‌‌‌‌‌లో ఫీల్డింగ్ చేస్తున్న నైబ్ ఎడమ  తొడ  కండరాలు పట్టేసినట్టు కింద పడిపోయాడు. కానీ,  ఆట తిరిగి మళ్లీ తర్వాత  నైబ్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ కూడా చేసి ఓ వికెట్ పడగొట్టాడు. ఆటను ఆలస్యం చేయాలని తను నటించాడని  విమర్శలు వస్తున్నాయి.  

సంక్షిప్త స్కోర్లు

అఫ్గానిస్తాన్‌‌‌‌‌‌‌‌ : 20 ఓవర్లలో 115/5 (గుర్బాజ్ 43, రషీద్ 19*, రిషద్ 3/26)
బంగ్లాదేశ్ (టార్గెట్ 19 ఓవర్లలో 114) : 17.5 ఓవర్లలో 105 ఆలౌట్ (లిటన్ దాస్ 54*, తౌహిద్ 14, రషీద్ 4/23, నవీన్ 4/26)