హరారే : బ్యాటింగ్‌లో సెడిఖుల్లా అటల్ (104), అబ్దుల్ మాలిక్ (84) దంచికొట్టడంతో.. గురువారం జరిగిన రెండో వన్డేలో అఫ్గానిస్తాన్ 232 రన్స్ తేడాతో జింబాబ్వేపై భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో అఫ్గాన్ 1–0 లీడ్‌లో నిలిచింది. రన్స్ పరంగా అఫ్గాన్ వన్డే హిస్టరీలో ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 286/6 స్కోరు చేసింది. అటల్, మాలిక్ తొలి వికెట్‌కు 191 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు. అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (5), రహమత్ షా (1), ఇక్రామ్ అఖిల్ (5) నిరాశపర్చినా, హష్మతుల్లా షాహిది (29 నాటౌట్), మహ్మద్ నబీ (18) ఫర్వాలేదనిపించారు.
న్యూమాన్ యమురి 3, ట్రెవర్ గ్వాండ్ రెండు వికెట్లు తీశారు. తర్వాత జింబాబ్వే 17.5 ఓవర్లలో 54 రన్స్‌కే కుప్పకూలింది. సికిందర్ రజా (19) టాప్ స్కోరర్. సీన్ విలియమ్స్ (16)తో సహా అందరూ ఫెయిలయ్యారు. ఇన్నింగ్స్‌లో 9 మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. గజ్నాఫర్, నవీద్ జద్రాన్ చెరో మూడు, ఫజల్‌హక్ రెండు వికెట్లు పడగొట్టారు. అటల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య మూడో వన్డే శనివారం జరుగుతుంది.