టీ20 వరల్డ్ కప్ లో పసికూన ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్‌కు బిగ్ షాకిచ్చింది. గ్రూప్ సీలో భాగంగా గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో జూన్ 08వ తేదీన జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్‌ను 84 పరుగుల తేడాతో ఓడించి ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు20 ఓవర్లలో 6 వికెట్లకు159 పరుగులు చేసింది.
రహ్మానుల్లా గుర్బాజ్ కేవలం 56 బంతుల్లో అద్భుతమైన 80 పరుగులు చేశాడు. ఇబ్రహీం జద్రాన్ 44 పరుగులు చేశాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ 13 బంతుల్లో 22 పరుగులతో అద్భుతంగా ఆడి జట్టు స్కోర్ ను పెంచాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కివీస్ జట్టును 15.2 ఓవర్లలో కేవలం 75 పరుగులకే పరిమితం చేసింది.
కివీస్‌లో గ్లెన్ ఫిలిప్స్ (18), మాట్ హెన్రీ (12) మాత్రమే రెండంకెల స్కోరును అధిగమించారు. ఇక ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4, ఫారుఖీ 4, నబీ రెండు వికెట్లు తీశారు. కాగా ఈ టోర్నీలో ఇప్పటికే పాకిస్థాన్ ను USA ఓడించి సంచలనం సృష్టించింది.