ప్రపంచ క్రికెట్ లో బెస్ట్ స్పిన్ అటాకింగ్ ఉన్న జట్లలో ఆఫ్ఘనిస్తాన్ ఒకటి. వారి పేస్ బౌలింగ్, బ్యాటింగ్ విభాగం ఎలా ఉన్నా ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన బలం స్పిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహమాన్, మహమ్మద్ నబీ వారి సొంతం. వీరికి తోడు నయా సంచలనం నూర్ అలీ ఉండనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో భారత్ తో మ్యాచుకు ముందు ఆఫ్ఘానిస్తాన్ కెప్టెన్ తన స్పిన్నర్లను ఆకాశానికెత్తేశాడు.
వరల్డ్ కప్ లో రేపు(అక్టోబర్ 11) ఢిల్లీ వేదికగా టీమిండియాతో ఆఫ్ఘనిస్తాన్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో రోహిత్ సేన హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. తాజాగా ఢిల్లీలో ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఆఫ్గాన్ కెప్టెన్ హస్మతుల్లా షాహిదీ భారత్ కంటే మాకు మెరుగైన స్పిన్నర్లు ఉన్నారని.. వారి కంటే మేము మంచి స్పిన్నర్లతో రేపటి మ్యాచులో బరిలోకి దిగుతామని తెలిపాడు. ప్రస్తుతం టీమిండియాలో అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్ లాంటి క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు.
- ALSO READ| Cricket World Cup 2023: బంగ్లాదేశ్పై ఇంగ్లాండ్ రికార్డుల మోత..ఆల్టైం రికార్డ్ బ్రేక్ చేసిన మలాన్
ఆఫ్గాన్ స్పిన్ అటాకింగ్ కూడా బలంగానే ఉన్నా షాహిద్ మాత్రం కాస్తా అత్యుత్సాహం చూపించినట్లుగా అనిపించింది. గత మ్యాచులో బంగ్లా స్పిన్నర్ల ధాటికి కుదేలైన ఆఫ్ఘనిస్తాన్ భారత్ పై ఏ మాత్రం పోరాడుతుందో చూడాలి. కాగా.. వరల్డ్ కప్ తొలి మ్యాచులో ఆసీస్ మీద భారత్ విజయం సాధించగా.. ఆఫ్ఘనిస్తాన్ మాత్రం బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయింది.