మీ చేతగాని లెక్కల వల్లే ఓడిపోయాం : ఆఘ్గనిస్తాన్ క్రికెట్ జట్టు కంప్లయింట్

మీ చేతగాని లెక్కల వల్లే ఓడిపోయాం : ఆఘ్గనిస్తాన్ క్రికెట్ జట్టు కంప్లయింట్

 

ఆసియా కప్‌లో భాగంగా మంగళవారం శ్రీలంక-ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచులో చివరి వరకు పోరాడినా ఆఫ్ఘాన్‌ జట్టుకి పరాజయం తప్పలేదు. అయితే ఈ మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ ఆడిన తీరు అభిమానుల మనసులను గెలుచుకుంది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచులో  ఆఫ్ఘనిస్థాన్‌ చివర్లో చేసిన చిన్న తప్పుతో మ్యాచ్‌తో పాటు సూపర్-4 వెళ్లే అవకాశాలను చేజార్చుకున్నారు. 

లెక్కలు తెలియక జరిగిన తప్పుకు ఆఫ్ఘానిస్థాన్‌ భారీ మూల్యం చెల్లించుకుంది. 37.1 ఓవర్లలో 292 పరుగులు చేయాలనే లెక్క ఒక్కటే తెలుసుకుని, దాని కోసం చివరి వరకు పోరాడింది. ఈ క్రమంలో విజయానికి 3 పరుగుల దూరంలో ఆగిపోయింది. అయితే ఆ తర్వాత కూడా 38వ ఓవర్‌లో మిగిలిన 5 బంతుల్లో ఏ ఒక్క సిక్స్‌ వెళ్లినా..ఆఫ్ఘానిస్తాన్ జట్టు సూపర్-4 కి అర్హత సాధించేది. కానీ అప్పటికే తాము ఓడిపోయామని ఆఫ్ఘానిస్తాన్ టీం ఫిక్సయింది.         

నిజానికి ఈ మ్యాచులో సూపర్ 4 రౌండ్‌కి అర్హత సాధించేందుకే చేయాల్సిన పరుగుల గురించి సరైన సమాచారం ఆఫ్ఘాన్‌కి అందలేదు .దీంతో క్వాలిఫైకేషన్‌‌ గణాంకాల గురించి తమకు సరైన ఇవ్వలేదని.. దీంతో ఓడిపోయామని ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ అధికారులపై కేసు వేసింది ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు. ఇందుకు కారణమైన వారికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు. మరి దీనిపై ఆసియా కప్ క్రికెట్ కౌన్సిల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.