Noor Ali Zadran: అంత‌ర్జాతీయ క్రికెట్‌కు ఆఫ్గ‌న్‌ స్టార్ రిటైర్మెంట్

Noor Ali Zadran: అంత‌ర్జాతీయ క్రికెట్‌కు ఆఫ్గ‌న్‌ స్టార్ రిటైర్మెంట్

ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్ నూర్ అలీ జద్రాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దశాబ్దానికి పైగా కెరీర్‌కు గురువారం(మార్చి 7) వీడ్కోలు పలికాడు. ఆఫ్ఘన్ తరుపున జద్రాన్ 2 టెస్టులు, 51 వన్డేలు, 23 టీ20లు ఆడాడు. వన్డేల్లో 24.81 సగటుతో 1216 పరుగులు, టీ20ల్లో 27.13 సగటుతో 597 పరుగులు చేశాడు. ఇటీవల ఐర్లాండ్‌ తో జ‌రిగిన ఏకైక టెస్టులో అత‌ను చివ‌రిసారి ఆఫ్ఘన్ జట్టుకు ప్రాతినిథ్యం వ‌హించాడు.

2009లో అంతర్జాతీయ అరంగేట్రం

2009 ఏప్రిల్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన వ‌న్డే ద్వారా నూర్ అలీ జద్రాన్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో 28 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. అనంత‌రం 2010లో కెనడాపై టీ20ల్లో అరంగేట్రం చేసిన జ‌ద్రాన్.. 

ALSO READ :- IND vs ENG 5th Test: సర్ఫరాజ్ హాఫ్ సెంచరీ.. భారీ ఆధిక్యంలో భారత్

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్‌పై హాఫ్ సెంచ‌రీ బాదాడు. ఆపై కొన్నాళ్లు ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన జద్రాన్.. 2023లో ఆసియా గేమ్స్‌ టోర్నీలో ఆఫ్ఘన్ తరుపున ఆడాడు. అతడి అద్బుత ప్ర‌ద‌ర్శ‌న‌ వల్ల ఆఫ్గన్ జ‌ట్టు ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. కానీ, ఫైనల్ లో భారత్ చేతిలో పరాజయం పాలైంది.