వరల్డ్ కప్ 2023లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిజంగా అద్భుతాలు సృష్టించింది. ఓ దశలో సెమీస్ రేసులో ఉంటుందన్న భావన కలిపించింది. 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 6వ స్థానంలో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లను ఓడించింది. ఆసీస్, దక్షిణాఫ్రికా లాంటి జట్లను ఓడించేంత పనిచేసింది. అయితే గ్రౌండ్ లోనే ఆటతోనే కాదు బయట మంచి మనసుతో ఆ జట్టు ఆటగాళ్లు ప్రేక్షకులు హృదయాలను గెలుచుకుంటున్నారు.
ఇటీవల అహ్మదాబాద్ వీధుల్లో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న బిచ్చగాళ్లకు దీపావళి జరుపుకునేందుకు ఆఫ్గాన్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్ డబ్బు ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీధుల్లో నిద్రిస్తున్న వారి దగ్గరికి వెళ్లి డబ్బును ఇవ్వడం, ఆ తరువాత ఏమీ తెలియనట్లుగా అక్కడి నుంచి కారులో వెళ్లడం రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో రహ్మానుల్లాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Gurbaz left in his car after keeping money beside needy people on the streets of Ahmedabad.
— CricTracker (@Cricketracker) November 12, 2023
Watch it ?https://t.co/jJgBqtvCeZ