పశ్చిమఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం సంభవించింది. హెరాత్‌లోని జిందా జన్ జిల్లా"లో 7.7 కి.మీ లోతులో 5.9 తీవ్రతతో తాజా భూకంపం సంభవించింది. దాదాపు 320 మంది మరణించారు. 12 గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వందలాది మంది గాయపడ్డారు. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్ లో హెరాత్ లో శనివారం(అక్టోబర్7) మొత్తం ఆరుసార్లు భూమి కంపించింది. ఫరా మరియు బద్గీస్ ప్రావిన్సులలో కూడా భూకంపం సంభవించింది.పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో శనివారం ఆరు భూకంపాలు సంభవించాయి. అత్యధికంగా 6.3 తీవ్రతతో భూకంపం విధ్వంసం సృష్టించిందని అధికారులు తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్ తరుచుగా భూకంపాలకు గురవుతుంది. ముఖ్యంగా హిందూ కుష్ పర్వత శ్రేణులలో, యురేషియన్ , భారతీయ టెక్టోనిక్ సమీపంలో ఎక్కువగా భూ ప్రకంపనలకు గురవుతుందని యూఎస్ జియోలాజికల్ సర్వే చెపుతోంది. జూన్ 2022లో తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లోని పర్వత ప్రాంతంలో భారీ భూకంపం సంభవించి వెయ్యి మందికి పైగా మృతిచెందారు. దాదాపు 15వందల మంది గాయపడ్డారు.