షార్జా స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. పాక్ చేతిలో ఓటమి జీర్ణించుకోలేక వీరంగ సృష్టించారు. గెలుస్తామనుకున్న మ్యాచ్ను కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. విధ్వంసానికి పాల్పడ్డారు. షార్జా స్టేడియంలో కుర్చీలను విరగ్గొట్టారు. వాటి ముక్కలను గాల్లోకి ఎగరేశారు.
పాక్ ఫ్యాన్స్పై దాడి..
కుర్చీలు విరగ్గొట్టడంతోనే ఆగలేదు. పాకిస్తాన్ అభిమానులపై కూడా ఆప్ఘనిస్తాన్ ఫ్యాన్స్ దాడులు చేశారు. విరిగిన కుర్చీలను పాక్ ఫ్యాన్స్‌పై విసిరారు. అవి తగిలి కొందరికి తేలికపాటి గాయాలయ్యాయి. అటు పాక్ ఫ్యాన్స్ కూడా ఎదురుదాడికి దిగారు. రెండు జట్ల అభిమానుల మధ్య ఘర్షణ తలెత్తింది. గ్రౌండ్ స్టాఫ్, స్టేడియం భద్రత సిబ్బంది జోక్యం చేసుకోవడంతో వెనక్కి తగ్గారు. ఈ ఘర్షణకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
This is just so disappointing to see. pic.twitter.com/qif9dNM3Qx
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 7, 2022
ఆసిఫ్ అలీ వర్సెస్ ఫరీద్ అహ్మద్..
మ్యాచ్ జరుగుతున్న సమయంలో పాక్ బ్యాట్స్ మన్ ఆసిఫ్ అలీ, ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫరీద్ అహ్మద్ మధ్య గొడవ జరిగింది. ఫరీద్ బౌలింగ్లో ఆసిఫ్ అలీ ఔటయ్యాడు. అయితే వికెట్ తీసిన ఆనందంలో ఫరీద్..ఆసిఫ్ దగ్గరకు వెళ్లి..వికెట్ తీసినట్లు వెటకారంగా సైగ చేశాడు. ఆసిఫ్కు అది నచ్చకపోవడంతో..ఫరీద్ ను వెనక్కు నెట్టాడు. బ్యాట్తో కొట్టేందుకు వెళ్లాడు. అంపైర్తో పాటు..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్లు వచ్చి సర్దిచెప్పడంతో..వివాదం ముగిసింది.
The only thing more dangerous than ignorance is arrogance.#PakvsAfg pic.twitter.com/tCpe6wEzqb
— Qasim Khan Suri (@QasimKhanSuri) September 7, 2022
హోరా హోరీగా..
ఆసియా కప్ 2022 సూపర్ 4లో భాగంగా పాకిస్తాన్ -ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో పాక్ ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. ఫైనల్ చేరుకోవాలంటే గెలిచిన తీరాల్సిన ఈ మ్యాచ్‌లో రెండు జట్లు హోరాహోరిగా పోరాడాయి. ముందుగా ఆఫ్ఘన్ 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. టాప్ ఆర్డర్ బ్యాటర్ ఇబ్రహం జడ్రాన్ ఒక్కడే టాప్ స్కోరర్ 37 బంతుల్లో రెండు సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. ఓపెనర్ హజ్రతుల్లా జజయ్-21, రహ్మనుల్లా గుర్బాజ్-17, కరీం జనత్-15, నజీబుల్లా జడ్రాన్-10, కేప్టెన్ మహ్మద్ నబీ-0, అజ్ముతుల్లా ఒమర్‌జయ్-10, రషీద్ ఖాన్-18 పరుగులు చేశారు. ఆ తర్వాత పాక్ 19.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసి విజయం సాధించింది. షాదాబ్ ఖాన్ (26 బాల్స్‌లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 36), ఇఫ్తికర్ అహ్మద్ (33 బాల్స్‌లో 2 ఫోర్లతో 30 పరుగులు చేసి రాణించారు.