
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసక్తి సమరానికి రంగం సిద్ధమైంది. బుధవారం(ఫిబ్రవరి 26) జరిగే గ్రూప్–బి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్,ఇంగ్లాండ్ డూ ఆర్ డై మ్యాచ్ లో తలపడనున్నాయి. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. తొలి పోరులో సౌతాఫ్రికా చేతిలో భారీ తేడాతో ఓడిన అఫ్గానిస్తాన్ ఈ పోరులో బట్లర్‌సేనకు ఎలాంటి పోటీ ఇస్తుందో చూడాలి. మరోవైపు ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో తమ తొలి పోరులో 350 ప్లస్ స్కోరును కూడా కాపాడుకోలేక డీలా పడింది.
బ్యాటర్లు ఆకట్టుకున్నా.. ఇంగ్లిష్ టీమ్ బౌలర్లు పూర్తిగా నిరాశపరిచారు. అఫ్గాన్‌తో పోరులో బౌలింగ్‌లో మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. గాయపడిన కార్స్ స్థానంలో ఓవర్ టన్ వచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంది.
ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI):
ఫిలిప్ సాల్ట్, బెన్ డకెట్, జేమీ స్మిత్(వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జోఫ్రా ఆర్చర్, జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI):
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఫజల్హక్ ఫర్
We are back in Lahore!
— ESPNcricinfo (@ESPNcricinfo) February 26, 2025
Hashmatullah Shahidi wins the toss and Afghanistan will bat first
🔗 https://t.co/IgPtXoyieM | #ChampionsTrophy pic.twitter.com/sxIv1BVqBY