Cricket World Cup 2023: ఇకపై పసికూనలు కాదు: వరల్డ్ కప్ లో సంచలనాలు సృష్టిస్తున్న ఆఫ్ఘనిస్తాన్..

Cricket World Cup 2023: ఇకపై పసికూనలు కాదు: వరల్డ్ కప్ లో సంచలనాలు సృష్టిస్తున్న ఆఫ్ఘనిస్తాన్..

చిన్న జట్టే కదా అని లైట్ తీసుకున్నారు. పిడుగులా రెచ్చిపోయారు. పసికూన జట్టనుకున్నారు... బొమ్మ చూపించారు. టార్గెట్ వీలేమీ కొడతారులే అనుకున్నారు వికెట్ పడకుండా, టెన్షన్ పడకుండా చుక్కలు చూపించారు. ఛేజింగ్ కు ముందు ఇది పాక్  ఫీలింగ్. కానీ తీరా చూస్తే చివరకు పిల్లలే పిడుగుల్లా చెలరేగి మట్టి కురిపించారు.

సోమవారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ లో  పాకిస్థాన్ కు అనూహ్య షాక్ ఇచ్చింది అఫ్గయాం జట్టు. మొదట బౌలింగ్ లో తేలిపోయినా బ్యాటింగ్ లో మాత్రం సమిష్టిగా రాణించింది.  గర్భాజ్(65), ఇబ్రహీం జద్రాన్(47) తొలి వికెట్ కు 130 పరుగులు జోడించి ఆఫ్ఘనిస్తాన్ ను విజయతీరాలకు నడిపించారు. వీరిద్దరూ ఔటైనా రహ్మతుల్లా షా(77), కెప్టెన్ హాశ్మతుల్లా షాహిద్(48) జాగ్రత్తగా చివరి వరకు ఆడుతూ ఆఫ్ఘనిస్తాన్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.  ఆడిన నలుగురులో ముగ్గురు అర్ధ సెంచరీలు చేయడం విశేషం.
 
ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టును పసికూన అని భావిస్తే షాక్ తప్పదని పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని రోజుల క్రితం డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ ను మట్టికరిపించిన ఈ జట్టు.. తాజాగా పాక్ ను చిత్తు చేసింది. 2019 లో ఆడిన 9 మ్యాచుల్లో ఓడిపోయి ఒక్క మ్యాచ్ కూడా గెలవని అప్రతిష్టను మూట కట్టుకున్న ఆఫ్ఘన్.. ప్రస్తుతం జరుగుతున్న టోర్నీలో రెండు మ్యాచుల్లో గెలిచి సెమీస్ ఆశలు ఇంకా అలాగే ఉంచుకుంది. 

Also Read :- మంటగలిసిన పాక్ క్రికెట్ పరువు.

ఈ వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీస్ కి చేరడం కష్టమైనా.. మరో కొన్ని జట్లకు షాక్ ఇచ్చి వారి అవకాశాలను దెబ్బ తీసే అవకాశం ఉంది.  ఈ నేపథ్యంలో పెద్ద జట్లన్నీ ఆఫ్ఘనిస్తాన్ జాతిపై మ్యాచ్ ఆంటే కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. మొత్తానికి ఆడిన ఐదు మ్యాచుల్లో రెండు చారిత్రాత్మక విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నఆఫ్ఘనిస్తాన్.. మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.